: సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు భజనపరులుగా మారారు: కోడెల
సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలపై టీడీపీ నేత కోడెల శివప్రసాద్ రావు ధ్వజమెత్తారు. వారు భజనపరుల్లా మారారని, దమ్ముంటే వారు ప్రజల్లోకి వచ్చి మాట్లాడాలని ఆయన సవాల్ విసిరారు. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ, సోనియా, చిదంబరం, మొయిలీ, దిగ్విజయ్ సింగ్ రాష్ట్రాన్ని పిశాచాల్లా పట్టి పీడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక జగన్ దీక్షపై స్పందిస్తూ, ఆయనది దొంగ దీక్ష అని అభివర్ణించారు. ఇంట్లో కూర్చుని దీక్ష చేశారని విమర్శించారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో నిరాహార దీక్ష చేసి సమస్య తీవ్రతను జాతీయ నేతలకు అర్థమయ్యేలా చేశారని చెప్పారు. దీక్షల పేరిట నాటకాలాడే వారికి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు.