: అర్ధ సెంచరీలు చేసిన ధావన్, రోహిత్.. ఇండియా 144/0
భారత ఓపెనర్లు గాడిలో పడ్డారు. ధాటిగా ఆడుతున్న ధావన్(66), రోహిత్(61) అర్థ సెంచరీలు సాధించారు. అందరు బౌలర్లనూ ప్రయోగించినా కెప్టెన్ బెయిలీ ఫలితాన్ని రాబట్టడంలో విఫలమయ్యాడు. ఓపెనర్లు చక్కగా ఆడుతుండడంతో టీమిండియా 22 ఓవర్లు ముగిసేసరికి వికెట్లేమీ కోల్పోకుండా 144 పరుగులతో పటిష్ఠ స్థితిలో నిలిచింది.