: దీటుగా జవాబిస్తున్న టీమిండియా
ఆసీస్ విసిరిన 360 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా దీటుగా ఆడుతోంది. జైపూర్లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత జట్టు 11 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 37 పరుగులతోనూ, రోహిత్ శర్మ 31 పరుగులతోనూ ఆడుతున్నారు. భారత్ విజయానికి 39 ఓవర్లలో 280 పరుగులు చేయాలి.