: చంద్రబాబు విశ్వసనీయత కోల్పోయారు: దిగ్విజయ్
రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం యూటర్న్ తీసుకున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విశ్వసనీయత కోల్పోయారని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. ఈ సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీకి తీర్మానం పంపే విషయమై హోం మంత్రి షిండేతో చర్చించి నిర్ణయిస్తామని తెలిపారు. ఇక సీమాంధ్రలో ఉద్యమాలు తగ్గుముఖం పట్టాయని అన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు వస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.