: మోడీ ప్రధాని అయితే సంతోషిస్తా: అద్వానీ
రానున్న సార్వత్రిక ఎన్నికల అనంతరం బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రధాని పదవి అధిష్ఠిస్తే తాను సంతోషిస్తానని బీజేపీ అగ్రనేత అద్వానీ అన్నారు. అహ్మదాబాద్ లో ఆయన మాట్లాడుతూ, మోడీ ఎప్పుడూ కొత్తదనం కోసం అన్వేషిస్తుంటారని తెలిపారు. మోడీ ఆలోచనా విధానంతోనే గుజరాత్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిందని చెప్పారు. గత కొంత కాలంగా పార్టీ ప్రధాని అభ్యర్థిగా మోడీని వ్యతిరేకిస్తున్న ఆయన తాజాగా మోడీకి అనుకూలంగా మాట్లాడడం విశేషం.