: రైల్వే బోర్డు ఛైర్మన్ గా అరుణేంద్రకుమార్
రైల్వే బోర్డు కొత్త ఛైర్మన్ గా అరుణేంద్రకుమార్ ను నియమించారు. బోర్డు ఛైర్మన్ గా కుమార్ పేరును కేబినెట్ అపాయింట్ మెంట్ కమిటీ ప్రతిపాదించగా రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే ఆమోదించారు. జూన్ 30న వినయ్ మిట్టల్ పదవీ విరమణ పొందడంతో... అప్పటి నుంచి అరుణేంద్రకుమార్ బోర్డు ఛైర్మన్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటిదాకా ఆయన మెంబర్ మెకానికల్ పదవిలో ఉన్నారు.