: పాక్ లో హత్యకు గురైన సింగపూర్ మోడల్
సింగపూర్ కు చెందిన ఒక యువ మోడల్ పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ లో హత్యకు గురైంది. మోడల్ ఫెమినా చౌదరి(27) గత గురువారం ఇస్లామాబాద్ లో కనిపించకుండా పోయింది. ఈ క్రమంలో పోలీసులు ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ ని అనుమానించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ జరపగా, తాను ఫెమినాని చంపి నగరానికి దూరంగా ఉన్న నదిలో పడేశానని తెలిపాడు. కరాచీకి చెందిన ఫెమినా సింగపూర్ లో స్థిరపడ్డారని, మానవతావాది అయిన ఆమె పాకిస్థాన్ లో ఫ్యాషన్ స్కూలు పెట్టేందుకు భూమి కొనుగోలు చేయడానికి వచ్చారని ఆమెకు మేనేజర్ గా వ్యవహరించిన అసిఫ్ హష్మి తెలిపారు.