: రాష్ట్ర విభజన ఖాయం: మంత్రి బాలరాజు
రాష్ట్ర విభజన ఖాయమన్న స్పష్టత వచ్చిందని మంత్రి బాలరాజు తెలిపారు. ఈ నేపథ్యంలో సీడబ్ల్యూసీ నిర్ణయానికి అనుగుణంగా పార్టీ కమిటీ వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు. కేంద్ర మంత్రుల బృందంతో సీమాంధ్ర ప్రాంత ప్రయోజనాల గురించి మాట్లాడాలని అన్నారు. ఇక, మరో మంత్రి కొండ్రు మురళి మాట్లాడుతూ.. శాసనసభలో విభజన తీర్మానాన్ని వ్యతిరేకిస్తామని తెలిపారు. అయితే, కాంగ్రెస్ ను వీడే ప్రసక్తే లేదని అన్నారు. కాంగ్రెస్ ద్వారా పదవులు అనుభవించిన కొందరు... ఇప్పుడు కాంగ్రెస్ కే హాని తలపెట్టేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.