: హ్యూస్, వాట్సన్ హాఫ్ సెంచరీలు


భారత్ తో రెండో వన్డేలో ఆసీస్ బ్యాట్స్ మెన్ పట్టుదలగా ఆడుతున్నారు. టాస్ గెలిచిన బెయిలీ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకోగా, పిచ్ అనుకూలతను సొమ్ము చేసుకుంటున్న ఆ జట్టు బ్యాట్స్ మెన్ నిలకడ ప్రదర్శిస్తున్నారు. ఫించ్ ఫిఫ్టీ సాధించి వెనుదిరగగా.. మరో ఓపెనర్ హ్యూస్, వన్ డౌన్ బ్యాట్స్ మన్ షేన్ వాట్సన్ హాఫ్ సెంచరీలు సాధించారు. హ్యూస్ 55 పరుగులతోనూ, వాట్సన్ 51 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ 28.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 158 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News