: బొగ్గు స్కాంలో ప్రధానిని ప్రథమ ముద్దాయిగా పేర్కొనాలి: బీజేపీ


దేశాన్ని కుదిపేస్తున్న బొగ్గు కుంభకోణం కేసులో ప్రధాని మన్మోహన్ సింగ్ ను ప్రథమ ముద్దాయిగా పేర్కొనాలని బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా డిమాండ్ చేశారు. బొగ్గు శాఖకు ప్రధాన మంత్రి ఇన్ ఛార్జ్ గా ఉన్నప్పుడు కోల్ బ్లాక్ ల కేటాయింపులు ఎలా జరిగాయో... బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్ ప్రజలకు తెలియజేయాలని కోరారు. 'ఇప్పుడు సమయం ఆసన్నమైంది... పరేఖ్ అన్ని విషయాలను పబ్లిక్ గా మాట్లాడాలి' అని సిన్హా సూచించారు. కుంభకోణంలోని చీకటి కోణాలను బయటపెట్టి... పరేఖ్ కడిగిన ముత్యంలా బయటపడాలని సిన్హా సూచించారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రధాని కార్యాలయం వరకు..... ప్రధాని కార్యాలయం నుంచి బొగ్గు శాఖ కార్యాలయం వరకు ఏమేం జరిగిందో పరేఖ్ బయటపెట్టాలని అన్నారు.

సీబీఐ దాఖలు చేసిన తాజా చార్జ్ షీట్లో తన పేరును ప్రస్తావించడం పట్ల పరేఖ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, తన పేరు చార్జ్ షీట్లో ఉన్నప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ పేరునూ చేర్చాలని పరేఖ్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో యశ్వంత్ సిన్హా ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News