: విద్వేషాలను రెచ్చగొట్టేందుకే వైఎస్సార్సీపీ సభ: ఎంపీ గుత్తా


వైఎస్సార్సీపీ తలపెట్టిన సమైక్య శంఖారావ సభ విద్వేషాలను రెచ్చగొట్టేందుకేనని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. జగన్ సభకు హైకోర్టు అనుమతివ్వడం దురదృష్టకరమన్నారు. సమైక్య సభకు న్యాయస్థానం అనుమతించిన తర్వాత నల్గొండలో గుత్తా మీడియాతో మాట్లాడారు. ఈ సభ వల్ల ఘర్షణలు చెలరేగే అవకాశాలున్నాయని తెలిపారు. తెలంగాణ గడ్డపై జగన్ సభకు తాము ఒప్పుకోబోమని అన్నారు. సమైక్య సభ నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ వెంటనే ఉపసంహరించుకోవాలని గుత్తా డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News