: నిలకడగా ఆసీస్ బ్యాటింగ్
భారత్ తో రెండో వన్డేలో ఆసీస్ బ్యాటింగ్ ఎలాంటి కుదుపులు లేకుండా సాగుతోంది. జైపూర్లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ కు ఓపెనర్లు ఫించ్ (36 బ్యాటింగ్), హ్యూస్ (20 బ్యాటింగ్) శుభారంభం అందించారు. ఆ జట్టు 12 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 58 పరుగులు చేసింది.