: దేవరకొండలో మత ఘర్షణలతో నిషేధాజ్ఞలు
నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో పోలీసుల నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. నిన్న రెండు మతవర్గాల మధ్య ఘర్షణలు జరగడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ రోజు బక్రీద్ ప్రార్థనలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఎస్పీ ప్రభాకర్ రావు తెలిపారు. ఘర్షణలకు కారకులైన వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కొంతమందిని అదుపులోకి తీసుకున్నామని, వారి పాత్రపై ప్రశ్నిస్తున్నామని ప్రభాకర్ రావు తెలిపారు.
నిన్న రాత్రి ఇరు వర్గాల మధ్య జరిగిన కొట్లాటలో బీజేపీ నేత సహా నలుగురికి గాయాలయ్యాయి. మతపరమైన పతాకాల ప్రదర్శనపై వివాదం కాస్తా ముదిరి ఇరు వర్గాలు రాళ్లు విసురుకోవడం, కర్రలతో కొట్టుకునే వరకు దారితీసింది. హైదరాబాద్ రేంజ్ డీఐజీ నవీన్ చంద్, ఇతర సీనియర్ పోలీసు అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.