: ధోనీ...క్రికెట్ లో కొత్త తరంగం: డీన్ జోన్స్


అతని బ్యాటింగులో సచిన్ ఆటలా క్లాస్ ఉండదు..అతని కీపింగ్ కూడా సాబా కరీం అంత షార్ప్ గా ఉండదు. కానీ అతడి ఆటే క్రికెట్ కు మజా తెస్తుంది. అప్పటి కప్పుడు ప్రత్యర్థులను కంగారు పెట్టే సత్తా ధోనీ సొంతమని పొగిడేస్తున్నాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్ జోన్స్. ధోనీ రిటైరయ్యే సమయానికి అతడు భారత్ తరపున మేటి ముగ్గురు క్రికెటర్లలో ఒకడిగా ఉంటాడని జోన్స్ జోస్యం చెప్పాడు. 

మైదానంలో దిగిన ధోనీలో చిరుత పులిలాంటి స్వభావం కనిపిస్తుందని, అవసరమైనప్పుడు దూకుడుగా, లేదా నిదానంగా ఆడే సత్తా అతని సొంతమంటున్నాడీ కంగా
రూ క్రికెటర్. ధోనీ ఆటలో అతని గుండె ధైర్యమే ఎక్కువ కనిపిస్తుందన్న జోన్స్ ... ధోనీ బ్యాటింగ్ పరిణతికి అతని తాజా డబుల్ సెంచరీయే నిదర్శనమంటున్నాడు.

  • Loading...

More Telugu News