: ఆంధ్రప్రదేశ్ ను విభజించవద్దని రాష్ట్రపతికి ఎన్నారైల విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించవద్దని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఎన్నారైలు కోరారు. ఈ మేరకు లండన్ కు చెందిన ఎన్నారైలు వైఎస్సార్సీపీ తరపున రాష్ట్రపతికి ఫ్యాక్స్ ద్వారా వినతిని పంపారు. విభజిస్తే సీమాంధ్ర ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.