: భారత్ తో క్రికెట్ బంధాన్ని పునరుద్ధరించాలి: పాక్ ప్రధాని
భారత్ తో క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించాలని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ నాజమ్ సేతీని ఆదేశించారు. భారత్ తో సిరీస్ లను తటస్థ వేదికపై నిర్వహించడంపై దృష్టి సారించాలని కోరారు. పీసీబీ గౌరవాధ్యక్షుడిగా నవాజ్ షరీఫ్ బాధ్యతలు చేపట్టడంతో ఆయనిలా పిలుపునిచ్చారు.