: కనుమూరి ఇంటి వద్ద ఉద్రిక్తత


నరసాపురం ఎంపీ, టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజుకు సమైక్య సెగ తగిలింది. సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు పదవులకు రాజీనామా చేసి, తద్వారా రాజకీయ సంక్షోభం సృష్టించి రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ.. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం ఐ భీమవరంలోని ఆయన ఇంటిని రాష్ట్ర రైతు జేఏసీ నేతలు ముట్టడించారు. విభజనను వ్యతిరేకిస్తూ కనుమూరి బాపిరాజు రాజీనామా చేయనందున, ఆయన నివాసం వద్దే నేడు, రేపు.. స్నానం, నిద్ర, భోజనం అన్ని కార్యక్రమాలు చేయాలని నిర్ణయించారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

  • Loading...

More Telugu News