: పాక్ దురాగతానికి హైదరాబాదీ వీరజవాన్ ఫిరోజ్ ఖాన్ మృతి
త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగ ఒక్కరోజు ఉందనగా హైదరాబాదీ వీరజవాను ఫిరోజ్ ఖాన్ పాకిస్థాన్ బలగాల తూటాలకు నేలకొరిగాడు. నిన్న పూంచ్ సెక్టార్ లో నియంత్రణ రేఖ వెంబడి పాక్ దళాలు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. ఈ క్రమంలో ప్రయోగించిన మోర్టార్ గుళ్ళు తగిలి లాన్స్ నాయక్ ఫిరోజ్ ఖాన్ అసువులు బాశాడు. 48 గంటలపాటు కొనసాగిన కాల్పుల్లో ఈ హైదరాబాదీ వీరజవాన్ నేలకొరగడంపై వైట్ నైట్ కోర్ కమాండర్ తీవ్ర సంతాపం తెలిపారు.