: స్కాంలో ప్రధాని పేరునూ చేర్చాలి: బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి


బొగ్గు కుంభకోణంలో తన పేరు చేర్చడంపై మండిపడుతున్నారు బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్. సీబీఐ దాఖలు చేసిన తాజా చార్జ్ షీట్లో తన పేరును ప్రస్తావించడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, తన పేరు చార్జ్ షీట్లో ఉన్నప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ పేరునూ చేర్చాలని అన్నారు. ఆర్ధిక నిర్ణయాలు తీసుకునేది ప్రధానే అని, అలాంటప్పుడు ఆయనకు తెలియకుండా కేటాయింపుల జరగవని పరేఖ్ చెప్పారు. బిర్లా సంస్థల అధినేత కుమారమంగళం బిర్లాకు రెండు కోల్ బ్లాకులు కేటాయించిన వైనంపై సీబీఐ నిన్న చార్జ్ షీట్ దాఖలు చేసింది. దీంట్లో కుమారమంగళం బిర్లా, పరేఖ్ లను నిందితులుగా చేర్చింది.

  • Loading...

More Telugu News