: పాలమూరు జిల్లాలో యువతిపై సామూహిక అత్యాచారం
పాలమూరు జిల్లా(మహబూబ్ నగర్) నాగర్ కర్నూల్ మండలం ఎండపెట్ల గ్రామంలో గత అర్థరాత్రి 16 ఏళ్ల యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో, బాధితురాలు నాగర్ కర్నూలు పోలీసులను ఆశ్రయించింది. తక్షణం స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. బాధితురాలిని వైద్యపరీక్షల నిమిత్తం మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.