: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి


ఈ రోజు తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై సిమెంట్ లోడుతో వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరణించిన వారు ఇందోల్ గ్రామానికి చెందిన చెన్నారెడ్డి, పవిత్ర, సాయినాథ్ రెడ్డి, శకుంతలగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News