: భారత సంతతి వారిని దోచుకున్న ముగ్గురికి 30 ఏళ్ల జైలు
అమెరికాలోని ఫ్లోరిడాలో భారత సంతతి వారి గృహాలలో వరుసగా దోపిడీలకు పాల్పడిన ముగ్గురు నిందితులకు స్థానిక కోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఫ్లోరిడా పరిధిలోని హిల్స్ బరో, పినెల్లాస్, పాస్కో, మారియాన్, అలాచు కౌంటీలలో భారత సంతతి వ్యక్తులకు చెందిన ఇళ్లలో లూయిస్ రోడ్రిగెజ్, డేవిడ్ మారియన్, జాన్ రోమెరో అనే ముగ్గురు ఆగస్టులో 11 దోపిడీలకు పాల్పడినట్లు కోర్టు నిర్థారించింది.