: కడపలో లాకప్ డెత్?


విచారణ పేరిట పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన కడప తాలూకా పోలీస్ స్టేషన్ లో జరిగింది. ఏఎస్సై విచక్షణా రహితంగా కొట్టడం వల్లే తన తండ్రి మరణించాడని మృతుని కుమారుడు వాపోయాడు. కడపలోని అక్కాయపల్లెకు చెందిన సుబ్బరాయుడు (63) కొడుకు వెంకటసుబ్బయ్య వేరే వ్యక్తికి డబ్బులు బాకీ ఉన్నాడు. ఈ నేపథ్యంలో, అప్పిచ్చిన వ్యక్తి తండ్రీకొడుకులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

కేసు విచారణ నిమిత్తం పోలీసులు తండ్రీకొడుకులిద్దరినీ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. విచారణ సమయంలో సుబ్బరాయుడు వీపుపై ఏఎస్సై లాఠీతో కొట్టడంతో... ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా... ఆయన అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు. దీంతో తన తండ్రి మృతికి ఏఎస్సై కారణమని మృతుని కుమారుడు ఆరోపిస్తున్నాడు.

  • Loading...

More Telugu News