: లంక తమిళుల రక్షణకు చర్యలు: కేంద్రం
శ్రీలంకలో నివసిస్తున్న తమిళుల భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర మంత్రి వి. నారాయణ స్వామి చెప్పారు. ప్రస్తుతం లంకలో జరుగుతున్న పరిణామాలను కేంద్రం సునిశితంగా పరిశీలిస్తోందని ఆయన తెలిపారు.
ప్రధాన మంత్రి కార్యాలయంలో మంత్రి నారాయణ స్వామి విలేకరుతో మాట్లాడారు. లంక వ్యవహారంలో తొందరపాటు నిర్ణయాలు ఉండబోవని, జెనీవాలో జరిగిన మానవ హక్కుల మండలి సమావేశంలో ప్రవేశ పెట్టిన తీర్మానం అనుసరించే తదుపరి చర్యలుంటాయని ఆయన వివరించారు.