: ఆన్‌లైన్‌లో రోగాల సమాచారం
క్యాన్సర్, ఇతర మొండి వ్యాధులపై పరిశోధనలు సాగించే శాస్త్రవేత్తలకు ఉపకరించే సమాచారాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ సమాచారాన్ని వెబ్‌సైట్లో పొందుపరచినా ఈ సమాచారం పరిశోధకులకు మాత్రమేనని, అంతేతప్ప చికిత్సకు కాదని కూడా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన భారత సంతతికి చెందిన పరిశోధకులతో కూడిన శాస్త్రవేత్తల బృందం ఒక సరికొత్త డాటాబేస్‌ను రూపొందించింది. 14 వేలకు పైగా క్యాన్సర్, ఇతర వ్యాధి కారక జన్యువులు, వాటి నియంత్రణకు వాడే ఔషధాలకు సంబంధించి విస్తృత సమాచారాన్ని ఈ డాటాబేస్‌లో పొందుపరచారు. ఈ విషయాలను గురించి శాస్త్రవేత్తలు చెబుతూ తాము రూపొందించిన సమాచారం క్యాన్సరు వంటి మొండి వ్యాధులపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలకు చక్కగా ఉపయోగపడుతుందనే ఆశాభావాన్ని వెలిబుచ్చారు. ఈ పరిశోధనాబృందంలో భారత సంతతికి చెందిన జానకిరామన్, సుబ్రమణియన్, రామస్వామి గోవిందన్, రంజున్ డి.కుమార్, రాన్‌రోస్ ఉన్నారు. తాము రూపొందించిన సమాచారం ఆన్‌లైన్‌లో లభిస్తుందని అయితే దీన్ని చికిత్సకు ఉపయోగించరాదని, ఇది కేవలం పరిశోధనకొరకు మాత్రమే రూపొందించామని పరిశోధకులు స్పష్టం చేశారు.