: క్యాన్సర్‌ రోగులకు మేలుచేసే కూరగాయలు


క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే చికిత్స వల్ల వారిపై కలిగే రేడియేషన్‌ ప్రభావాలను తగ్గించడంలో కూరగాయలు బాగా తోడ్పడతాయని శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. అందునా క్యాబేజీ, కాలిఫ్లవర్‌ వంటి కూరగాయలు చక్కగా ఉపకరిస్తాయని శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. క్యాన్సర్‌ వ్యాధి చికిత్స వల్ల కలిగే రేడియేషన్‌ ప్రభావాన్ని క్యాబేజీ, కాలీఫ్లవర్‌లలోని డి.ఐ.ఎం సమ్మేళనం తగ్గించగలుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఎలుకలు, చిట్టెలుకలపై చేసిన ప్రయోగాలలో డి.ఐ.ఎంగా పిలిచే క్యాబేజీ, కాలీఫ్లవర్‌లనుండి సంగ్రహించిన సమ్మేళనాలు రేడియేషన్‌ ప్రభావం నుండి రక్షణ కల్పిస్తాయని జార్జిటౌన్‌ విశ్వవిద్యాలయ వైద్యకేంద్రానికి చెందిన అధ్యయనవేత్తలు గుర్తించారు. క్యాబేజీ, కాలీఫ్లవర్‌లనుండి సంగ్రహించిన సమ్మేళనాలను ఉపయోగించి క్యాన్సర్‌ చికిత్స పొందుతున్నవారి కణజాలాన్ని రేడియేషన్‌ నుండి రక్షించవచవ్చని, రేడియేషన్‌ కారణంగా రోగుల్లో కలిగే అనారోగ్యాన్ని తగ్గించవచ్చని వీరి అధ్యయనంలో తేలింది. డి.ఐ.ఎం క్యాన్సర్‌ నిరోధక కారకంగా పనిచేసే విషయంపై చాలా కాలంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నా రేడియేషన్‌ ప్రభావాన్ని శరీరంలో తగ్గించే అంశంపై మాత్రం ఇదే తొలి పరిశోధన అని అధ్యయనకర్తల్లో ఒకరైన జార్జిటౌన్‌ లాంబర్డి కాంప్రహెన్సివ్‌ క్యాన్సర్‌ సెంటర్‌కు చెందిన ఇలియట్‌ రోజెన్‌ చెబుతున్నారు.

తమ పరిశోధనలో ఎలుకలపై అధికస్థాయిలో గామా కిరణాలను ప్రయోగించి వాటిలో కొన్నింటికి పది నిముషాల వ్యవధిలో డి.ఐ.ఎం ఇంజక్షన్లను ఇస్తూ రెండు వారాలపాటు ప్రయోగాలు చేశారు. ఈ ఎలుకల్లో డి.ఐ.ఎం ఇవ్వని ఎలుకలు తొందరగా చనిపోగా, డి.ఐ.ఎం ఇంజక్షన్లను ఇచ్చిన ఎలుకలు ఎక్కువకాలం బతికాయి. ఈ పరిశోధనల ఫలితాలనుబట్టి క్యాన్సర్‌ వ్యాధికి చికిత్స తీసుకునేవారు రేడియేషన్‌ ప్రభావాన్ని తట్టుకోవడానికి డి.ఐ.ఎం ఎంతగానో సహకరిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News