: ఆస్తుల వివరాలు సమర్పించిన కేంద్ర మంత్రులు


రాష్ట్రానికి చెందిన నలుగురు కేంద్ర మంత్రులు చిరంజీవి, పనబాక లక్ష్మి, జేడీ శీలం, కిశోర్ చంద్రదేవ్ లు తమ ఆస్తుల వివరాలను ప్రధాన మంత్రి కార్యాలయానికి సమర్పించారు. రాష్ట్రానికి చెందిన 12 మంది కేంద్ర మంత్రుల్లో ఈ నలుగురే తమ ఆస్తుల వివరాలు అందించారు. కేంద్ర క్యాబినెట్ లో మొత్తం 77 మంది ఉండగా, వారిలో 35 మంది మాత్రమే తమ ఆస్తుల వివరాలను ప్రధానమంత్రి కార్యాలయానికి సమర్పించారు. వాస్తవానికి కేంద్ర మంత్రులు ఆస్తులు ప్రకటించేందుకు సెప్టెంబర్ నెలాఖరుతో గడువు ముగిసింది.

  • Loading...

More Telugu News