: దీపావళికి 12 ప్రత్యేక రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే
దీపావళి పండగ రద్దీ దృష్ట్యా హైదరాబాద్ నుంచి మచిలీపట్నం, రేణిగుంట, విశాఖలకు 12 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నవంబరు 3,10 తేదీల్లో ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్-మచిలీపట్నం ప్రత్యేక రైలు ఉంటుంది. అదే తేదీల్లో రాత్రి 9 గంటలకు మచిలీపట్నం-సికింద్రాబాద్ రైలు ఉంటుంది. నవంబర్ 1,8 తేదీల్లో రాత్రి 10.10 గంటలకు సికింద్రాబాద్-విశాఖ ప్రత్యేక సూపర్ ఫాస్ట్ రైలు.. 2,9 తేదీల్లో రాత్రి 7.05 గంటలకు విశాఖ-సికింద్రాబాద్ ల మధ్య ప్రత్యేక సూపర్ ఫాస్ట్ రైలు ఉంటుంది. నవంబరు 1,8 తేదీల్లో 11.15 గంటలకు హైదరాబాద్-రేణిగుంట ప్రత్యేక సూపర్ ఫాస్ట్ రైలు.. నవంబర్ 2,9 తేదీల్లో మధ్యాహ్నం 2.30 గంటలకు రేణిగుంట-హైదరాబాద్ ప్రత్యేక సూపర్ ఫాస్ట్ రైలు నడపనున్నారు.