: అమీర్ ఖాన్ తదితరుల నుంచి జరిమానాల రికవరీకి సీసీఐ చర్యలు
జరిమానా చెల్లించడంలో విఫలమైన బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, మరో 8 మంది నుంచి రికవరీకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) చర్యలు చేపట్టింది. రెండు సినీ నిర్మాతల సంఘాలు కూడా జరిమానా చెల్లించాల్సి ఉంది. వారి మీద విధించిన మొత్తం 2.17 కోట్ల రూపాయలు జరిమానాలు గత రెండేళ్లుగా పెండింగ్ లో ఉన్నాయని, ఎవరూ అప్పీల్ కూడా చేయలేదని సీసీఐ పేర్కొంది. వీరిందరిపై తగిన చర్యలు తీసుకుంటామని సీసీఐ స్పష్టం చేసింది. అమీర్ ఖాన్ పేరు మీద అయితే కేవలం లక్ష రూపాయల జరిమానా మాత్రమే ఉంది. సినిమా నిర్మాణం, విడుదల తదితర అంశాలపై ఫిర్యాదులను సీసీఐ పరిష్కరిస్తుంది.