: అవిశ్వాసంపై త్వరలో నిర్ణయం: చంద్రబాబు
అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు. టీడీపీ అవిశ్వాసం తీర్మానం పెడితే అది అవినీతి పరులకు లాభిస్తోందని పరోక్షంగా వైఎస్సార్సీపీకి చురకలంటించారు.
గతంలో ఓసారి తాము అవిశ్వాసం పెడితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు డబ్బు సంచులు సమకూరాయని తెలిపారు. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్న బాబు నేడు కార్యకర్తలతో సమావేశమయ్యారు. అవిశ్వాస తీర్మానం గురించి పార్టీ పొలిట్ బ్యూరోలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.