: సీఎం స్పష్టమైన హామీ ఇస్తే సమ్మె విరమణ : అశోక్ బాబు
సీఎం నుంచి స్పష్టమైన హామీ వస్తే సమ్మె విరమిస్తామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. హైదరాబాదులో ఆయన సీఎం కిరణ్ ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 17న సీఎం కిరణ్ తో మరోసారి సమావేశమవుతామని వెల్లడించారు. ముఖ్యమంత్రి ఇచ్చే హామీని బట్టే తమ నిర్ణయం ఆధారపడి ఉంటుందని అన్నారు. రేపు ఏపీఎన్జీవో సమావేశం ఉంటుందని, సీఎంతో చర్చించబోయే విషయాలను ఈ సమావేశంలో ఖరారు చేస్తామని వివరించారు. సమ్మె కొనసాగించాలా? వద్దా? అన్న విషయంపైనా చర్చిస్తామని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించినా సమ్మె ప్రభావం అలాగే ఉందని చెప్పుకొచ్చారు.
రాష్ట్ర విభజన నిర్ణయంపై చివరి వరకు పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీ వెళ్ళి జాతీయనాయకులను మరోసారి కలుస్తామని చెప్పారు. అలాగే, హైదరాబాదు, తెలంగాణ ఎమ్మెల్యేలను కలిసి రాష్ట్ర ఐక్యతకు తోడ్పడాలని కోరతామని తెలిపారు.