: 37 మంది భారత మత్స్యకారులను అరెస్ట్ చేసిన శ్రీలంక
మన దేశానికి చెందిన 37 మంది మత్స్యకారులను శ్రీలంక నౌకాదళం అరెస్ట్ చేసింది. సముద్ర జలాల్లో సరిహద్దు దాటినందుకే వీరిని అరెస్టు చేశామని లంక నేవీ అధికారులు తెలిపారు. నిన్న జరిగిన ఈ ఘటనలో 9 ట్రాలర్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వీరిని తలైమన్నార్ న్యాయస్థానంలో హాజరుపరుస్తామని శ్రీలంక నేవీ ప్రకటించింది.