: సోనియా పథకం మేరకే వారిద్దరూ నడుచుకుంటున్నారు: దేవినేని ఉమ
యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ పథకం ప్రకారమే సీఎం కిరణ్, జగన్ లు నడుచుకుంటున్నారని టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమ ఆరోపించారు. ముఖ్యమంత్రి నవంబర్ లో పదవికి రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నారని తెలిపారు. సీమాంధ్ర అభివృద్ధికి రూ 1200 కోట్ల ప్యాకేజీకి కేంద్ర మంత్రులు, ఎంపీలు అంగీకారం తెలిపారని ఆయన మండిపడ్డారు. తమ రాజీనామాలు ఆమోదింపజేసుకునేందుకు మంత్రులు సోనియా ఇంటి ముందు ధర్నా చేయాలని టీడీపీ నేత నేత రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు.