: ఎవరు వచ్చినా, రాకున్నా.. ఉద్యమం ఆగదు: శైలజానాథ్
ఎవరు కలిసి వచ్చినా, రాకున్నా.. సమైక్యాంధ్ర కోసం ఉద్యమం కొనసాగుతుందని మంత్రి సాకే శైలజానాథ్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని, దానివల్లే అభివృద్ధి సాధ్యమని తాము నమ్ముతున్నామని తెలిపారు. రాష్ట్ర విభజన అనివార్యమన్న కేంద్ర మంత్రి పురందేశ్వరి వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 17న సీమాంధ్ర ప్రజాప్రతినిధులు సమావేశం కానున్నారని ఆయన చెప్పారు. ఈ భేటీలో.. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణ చర్చించనున్నట్టు శైలజానాథ్ వెల్లడించారు.