: కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన బాబా రామ్ దేవ్


యోగా గురు బాబా రామ్ దేవ్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై తాను ప్రశంసల వర్షం కురిపించినప్పటి నుంచి కాంగ్రెస్ తనను లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. హరిద్వార్ లో ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈనాటికీ తనకు సీబీఐ తీరుపై ఎలాంటి సందేహాలు లేవని, కాంగ్రెస్ పార్టీ వైఖరిపైనే అనుమానాలున్నాయని స్పష్టం చేశారు. ప్రత్యర్థుల పనిబట్టేందుకు కాంగ్రెస్.. సీబీఐని పావులా వాడుకుంటోందని ఆరోపించారు. సీబీఐకి తానేమీ భయపడడంలేదని, ఎలాంటి దర్యాప్తుకైనా సిద్ధమని స్పష్టం చేశారు. స్వామి శంకర్ దేవ్ అదృశ్యం కేసులో సీబీఐ ఇటీవలే రామ్ దేవ్ ను ప్రశ్నించిన సంగతి తెలిసిందే. శంకర్ దేవ్.. బాబా రామ్ దేవ్ కు గురువు అన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News