: సీమాంధ్రకు ఒక్క ఊరును కూడా వదలం: పొంగులేటి
ఖమ్మం జిల్లాలోని భద్రాచలం డివిజన్ తెలంగాణలో అంతర్భాగమని... ఈ డివిజన్ లోని ఏ ఒక్క ఊరును కూడా సీమాంధ్రకు వదలబోమని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో తనకు ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలనుందని తెలిపారు. అంతే కాకుండా, వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీని తెలంగాణ నుంచి పోటీచేయాలని కోరుతున్నామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు తెలంగాణవాదులు వ్యతిరేకం కాదని పొంగులేటి తెలిపారు.