: ముజఫర్ నగర్ లో తగ్గని అల్లర్లు.. బాలికపై అత్యాచారం, హత్య
ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో అల్లర్లు మళ్ళీ మొదలైనట్టే కనిపిస్తోంది. తాజగా గడ్డి కోసుకురావడానికి పొలానికి వెళ్లిన 11 ఏళ్ల బాలికను దుండగులు అపహరించుకుపోయారు. అనంతరం ఆమె ఖరీసరాయ్ గ్రామపొలాల్లో కాళ్లు, చేతులు కట్టేసిన స్థితిలో విగతజీవిగా కనిపించింది. ఆమెను అత్యాచారం చేసి పీకపిసికి చంపేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో, గ్రామంలో ఉద్రిక్త వాతావరణం అలముకుంది. దోషులను తక్షణం అరెస్టు చేయాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.