: కోస్తాకు మరో తుపాను ముప్పు
కోస్తాంధ్రపై ప్రకృతి పగబట్టినట్టు కనిపిస్తోంది! మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందాన ఫైలిన్ ధాటికి కకావికలమైన ఉత్తర కోస్తావాసుల ముంగిట మరో ముప్పు పొంచి ఉంది. ఫసిఫిక్ మహాసముద్రంలో 'వైఫా' తుపాను కేంద్రీకృతమై ఉంది. మయన్మార్ మీదుగా ఇది బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. దీనిపై పూర్తి స్పష్టత ఈ నెల 17 కు కానీ రాదు. ఫైలిన్ విధ్వంసం నుంచి కోలుకుంటున్న ఉత్తరాంధ్ర వాసులకు ఇది దుర్వార్తే.