: పిల్లలను నదిలోకి విసిరేసిన పోలీసులు.. దీనికి తోడు చేతివాటం


మధ్యప్రదేశ్ లోని దాతియా జిల్లాలోని రతన్ గఢ్ ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో 117 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే, దిగ్భ్రాంతి కలిగించే కొన్ని విషయాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. తొక్కిసలాట సమయంలో భక్తులను కాపాడాల్సిన పోలీసులు... ఖాకీ ముసుగులో దొంగల అవతారం ఎత్తారు. ప్రాణభయంతో బెంబేలెత్తిన ప్రజలకు తెలియకుండా వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలను లూటీ చేశారు. తొక్కిసలాటలో గాయపడిన ఓ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె తన చెవి రింగులను ఒక పోలీసు లాగేసుకున్నాడని తెలిపింది. తన మంగళసూత్రం, గాజులను పోలీసులు లాక్కున్నారని మరో మహిళ వాపోయింది. ప్రత్యక్ష సాక్షులు మరో దిగ్భ్రాంతికర నిజాన్ని బయటపెట్టారు. అదేంటంటే... తొక్కిసలాట సమయంలో కొందరు పోలీసులు చిన్న పిల్లలను నదిలోకి విసిరేశారట. ఇలాంటి ఫిర్యాదులు ఇప్పుడు అక్కడ వెల్లువెత్తుతున్నాయి. దీంతో, ముఖ్యమంత్రి జరిగిన ఘటనలపై విచారణకు ఆదేశించారు. ఇప్పటికే ఈ ఘటనలో 21 మంది అధికారులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News