: బద్వేలులో సమైక్యాంధ్రకు మద్దతుగా రైతు సదస్సు
కడప జిల్లా బద్వేలులో సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఈ రోజు పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో రైతు సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు బద్వేలు, గోపవరం, అట్లూరు మండలాలకు చెందిన రైతులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. సమైక్య ఉద్యమాన్ని రైతుల భాగస్వామ్యంతో తీవ్రస్థాయికి తీసుకెళ్లడానికి ఉపాధ్యాయ, కార్మిక, ఉద్యోగ, వర్తక, రాజకీయ జేఏసీ నాయకులు నడుంబిగించారు. దీనికితోడు, గ్రామ స్థాయిలో పనిచేసే రెవెన్యూ సిబ్బంది బద్వేలులో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.