: కర్నూలులో 78వ రోజుకు చేరిన సమైక్య ఉద్యమం
సమైక్యాంధ్రకు మద్దతుగా కర్నూలులో చేపట్టిన సమైక్య ఉద్యమం 78వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో, పట్టణంలోని న్యాయవాదులు విధులను బహిష్కరించి రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. స్థానిక ఎన్టీఆర్ కూడలిలో ఏపీఎన్జీవోలు, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.