: బాబూ.. ఇప్పటికైనా నీ వైఖరేంటో చెప్పు: అనంత
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజనపై తన వైఖరేంటో స్పష్టం చేయాలని అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అనంతపురంలో నేడు మీడియాతో మాట్లాడుతూ, బాబు ఢిల్లీలో ఐదురోజుల పాటు ఎందుకు దీక్ష చేశారో ఆయనకే తెలీదని ఎద్దేవా చేశారు. బాబుకు విభజనపై స్పష్టత లేదన్నారు. రాజీనామాపై మాట్లాడుతూ, తాను మాత్రం స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామా చేశానని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ కన్నా ప్రజల మనోభావాలే ముఖ్యమని చెప్పారు. సమస్యలు పరిష్కరించకుండా, ఏకపక్షంగా విభజనకు పూనుకోవడం అన్యాయమన్నారు. విభజన ప్రకటనను కేంద్రం ఉపసంహరించుకోకుంటే రాజీనామాపై పునరాలోచించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.