: ఆధార్ తర్వాత రాజకీయాల్లోకి నందన్ నీలేకని?


ఆయన.. భారతదేశానికి ఐటీ గుర్తింపు తెచ్చిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరు. పేరు నందన్ నీలేకని. యూపీఏ ప్రభుత్వం దేశ ప్రజలందరికీ విశిష్ఠ గుర్తింపు సంఖ్య ఇవ్వాలనే బృహత్తర కార్యక్రమం ఆధార్ ప్రాజెక్టు చేపట్టి.. దాని బాధ్యతలను నందన్ నెత్తిన పెట్టింది. టెక్నాలజీ తెలిసిన వ్యక్తిగా ఆ బాధ్యతలను నందన్ దిగ్విజయం చేస్తాడని కేంద్ర ప్రభుత్వం ఆశ. దానికి తగినట్లుగానే నందన్ ఆధార్ ప్రాజెక్టును పురోగామి పథంలో నిలిపారు.

ఈ నేపథ్యంలో నందన్ రాజకీయాల్లోకి రానున్నారని, 2014లో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. వీటినే ఆయన వద్ద ప్రస్తావించగా.. ఆధార్ ప్రాజెక్టు పూర్తయిన అనంతరం అన్ని రకాల అవకాశాలనూ పరిశీలిస్తానని బదులిచ్చారు. రాజకీయాల్లోకి రానని మాత్రం చెప్పకపోవడం గమనించాల్సిన విషయం. ప్రభుత్వ రంగంలో పనిచేయడానికి కొన్ని సర్దుబాట్లు చేసుకున్నానని తెలిపారు.

  • Loading...

More Telugu News