: ప్రతీ ఇన్నింగ్స్ లో సెంచరీ కొట్టడమే లక్ష్యం: పుజారా


ప్రతీ మ్యాచ్ లో, ప్రతీ ఇన్నింగ్స్ లోనూ సెంచరీ కొట్టడమే తన లక్ష్యమని బ్యాటింగ్ చిచ్చరపిడుగు చటేశ్వర్ పుజారా తెలిపాడు. ఏ మ్యాచ్ అయినా, ఏ ఫార్మాట్ అయినా ధాటిగా ఆడడానికే ప్రాధాన్యత ఇస్తానన్నాడు. 'నేను స్థిరంగా ఆడితే చాలు ప్రజలు నన్ను మంచి క్రికెటర్ గా భావిస్తారు' అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇటీవల గుజరాత్ లో వెస్టిండీస్-ఏ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ట్రిపుల్ సెంచరీ చేసిన పుజారాను మీడియా కదిలించగా.. పై విధంగా స్పందించాడు.

రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్ రిటైర్ మెంట్ తో టెస్ట్ క్రికెట్ లో పుజారా సమీప కాలంలో నంబర్ వన్ గా నిలవనున్నాడని విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే ఎనిమిది నెలల కాలంలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ సిరీస్ లు ఉన్న నేపథ్యంలో పుజారాపై పెద్ద బాధ్యతలే ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో మూడు ట్రిపుల్ సెంచరీలు, ఎనిమిది డబుల్ సెంచరీలు సాధించి భారీ స్కోర్లపై తన మక్కువ చాటుకున్న ఈ సౌరాష్ట్ర యువకెరటం ఇటీవల కాలంలో మంచి ఫామ్ లో ఉన్నాడు.

  • Loading...

More Telugu News