: సర్పంచ్ కు మావోయిస్టుల బెదిరింపు లేఖలు
మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం ఉర్కొండ గ్రామ సర్పంచ్ కృష్ణయ్యకు మావోయిస్టుల పేర్లతో బెదిరింపు లేఖలు అందాయి. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. లేఖలను పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ లేఖలు స్థానికంగా కలకలం రేపాయి. గతంలో గ్రామంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తనపై కొందరు కక్ష కట్టారని ఆయన పోలీసులకు తెలిపారు. అందులో భాగంగానే ఈ లేఖలు పంపుంటారని కృష్ణయ్య ఆరోపించారు.