: రాష్ట్రం నుంచి ఎయిర్ కోస్టా సర్వీసులు ప్రారంభం


రాష్ట్రంలోని గన్నవరం విమానాశ్రయం కేంద్రంగా ఎయిర్ కోస్టా విమానయాన సేవలు ప్రారంభమయ్యాయి. 67 మంది ప్రయాణికులతో తొలి సర్వీసు విజయవాడ నుంచి బెంగళూరుకు బయల్దేరి వెళ్లింది. త్వరలో మరో మూడు సర్వీసులు అందుబాటులోకి రానున్నట్లు గన్నవరం విమానాశ్రయం డైరెక్టర్ తెలిపారు. గన్నవరం విమానాశ్రయం కేంద్రంగా ఒక విమానయాన సంస్థ సర్వీసులను నడపడం ఇదే ప్రథమం. ఈ సేవలను నిన్న శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించగా.. అసలు సర్వీసులు నేడు గన్నవరం నుండి మొదలయ్యాయి.

  • Loading...

More Telugu News