: తొక్కిసలాట ఘటనపై మధ్యప్రదేశ్ సర్కారు చర్యలు
మధ్యప్రదేశ్ లోని దాతియా జిల్లాలోని రతన్ గఢ్ ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో 117 మంది చనిపోగా, 100 మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, మధ్యప్రదేశ్ ప్రభుత్వం అధికారులపై కన్నెర్ర చేసింది. నిర్లక్ష్యంగా వ్యవహరించి ఘటనకు కారకులయ్యారని పేర్కొంటూ మొత్తం 21 మంది అధికారులపై వేటు వేసింది. వేటు పడిన వారిలో జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా ఉన్నారు. మరికొద్ది రోజుల్లో రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు ఉండటంతో... అధికారులను సస్పెండ్ చేయడం కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకుంది.