: ఫిలిప్పీన్స్ లో భూకంపం
ఫిలిప్పీన్స్ లోని బోహాల్ ఐలాండ్ లో ఈ రోజు ఉదయం తీవ్ర భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.4గా నమోదయింది. ఈ భూకంపం భూమికి దిగువన 56 కి.మీ. లోతులో కేంద్రీకృతమైంది. భూకంప తాకిడికి చాలా ఇళ్లు బీటలు వారాయి. మరికొన్ని కూలిపోయాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు చనిపోయినట్టు సమాచారం. ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.