: బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ దూకుడు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ సోదాలను ముమ్మరం చేసింది. ఈ కుంభకోణం కేసులో తాజాగా కుమార్ మంగళం బిర్లా, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పి.సి.పరేఖ్ పేర్లను సీబీఐ ఛార్జిషీట్ లో చేర్చింది. ఇవాళ ఉదయం నుంచి కోల్ కత, ముంబై, హైదరాబాద్ లలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.