: ఆ కుట్రదారుల తాట తీస్తాం :పవన్ కల్యాణ్
ఇటీవల తమ 'అత్తారింటికి దారేది' సినిమా విషయంలో జరిగింది పైరసీ కాదనీ, అది మహా కుట్ర అనీ హీరో పవన్ కల్యాణ్ అన్నారు. 'అత్తారింటికి దారేది' సినిమా 'థ్యాంక్యూ' వేడుకలో ఆయన ఈ విషయంపై ఆవేశంగా మాట్లాడారు.
"మా సినిమా విషయంలో పైరసీ జరిగిందనుకున్నాం. కానీ, అది పైరసీ కాదు. కావాలని చెప్పి కొంతమంది జరిపిన కుట్ర వల్లే ఇది జరిగింది. పైరసీ చేసే వాళ్ళయితే ఏభై రోజులు ఆగి చేయరు. ఇది కావాలని సరిగ్గా ఆ సమయంలో చేశారు. వాళ్ళెవరనేది మాకు పేర్లు సహా తెలుసు. వాళ్ళని వదలం. వాళ్ళు ఏ స్థాయిలో వున్న వ్యక్తులైనా కావచ్చు. వాళ్ళని వదిలే సమస్యే లేదు. వాళ్లకి సరైన 'న్యాయం' చేస్తాం. సంస్కారం కాదని నిగ్రహించుకుంటున్నాం. మా సహనాన్ని చేతగానితనంగా భావించవద్దు. అవసరమైతే తాట తీస్తాం" అంటూ పవన్ కల్యాణ్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు.
"ఈ పైరసీ విషయంలో అభిమానులకు హ్యాట్సాఫ్. వారు ఎంతగానో సహకరించి పైరసీ సినిమా చూడలేదు. కానీ, సినిమా ఇండస్ట్రీలో మాత్రం చాలా మంది డౌన్ లోడ్ చేసుకుని మరీ చూసేశారు" అన్నారు పవన్.